ఆత్మకూరు, సెప్టెంబర్ 23 : రెండు నెలలుగా పింఛన్లు( Pensions రావడం లేదంటూ వనపర్తి జిల్లా (Wanaparthi) ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వృద్ధులు రోడ్డెక్కారు. ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లో రోడ్డుపై సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తారోకో(Elderly dharna) చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. గతనెలతోపాటు ఈ నెల ముగుస్తున్నా ఇంకా పింఛన్ రాలేదన్నారు. రెండు నెలలుగా పింఛన్ రాకపోతే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు అరగంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని.. పోస్టాఫీస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. నెలనెలా మొదటి తారీఖునే పింఛన్ వచ్చేలా చూడాలని పింఛన్‌దారులు డిమాండ్ చేశారు.