లక్నో: బహిరంగ ప్రదేశంలో పొదల వద్ద మలవిసర్జన చేస్తున్న వ్యక్తిపై పులి దాడి చేసింది. (Tiger Attacks Man) ఇది చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పులిని తరిమేందుకు వారు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నగరియా కాట్ ప్రాంతంలో సోమవారం ఒక వ్యక్తి బహిరంగ ప్రాంతంలో మలవిసర్జన చేస్తుండగా పులి దాడి చేసింది. అతడ్ని తీవ్రంగా గాయపర్చింది.
కాగా, ఆ వ్యక్తిపై పులి దాడి చేయడం చూసి అక్కడున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. తొలుత వారంతా అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ గందరగోళంలో కొంత మంది రోడ్డుపై పడి గాయపడ్డారు. అనంతరం ధైర్యం చేసిన గ్రామస్తులు ఆ పులిని తరిమారు.
మరోవైపు పులి దాడి గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో కలిసి పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पीलीभीत
➡शौच के लिए गए ग्रामीण पर बाघ ने किया हमला
➡बाघ के हमले में ग्रामीण बुरी तरह से हुआ लहूलुहान
➡हमले के बाद ग्रामीणों की भीड़ ने बाघ की घेराबंदी की
➡बाघ को देख भीड़ में मची भगदड़ सड़क पर गिरे लोग
➡हमले के बाद डैम किनारे झाड़ियों में डेरा जमाकर बैठा बाघ
➡सूचना के बाद… pic.twitter.com/cviT5keaI4— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 23, 2024