ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 23 : రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ సెట్ – 2024 పరీక్ష ప్రశ్నాపత్రం ప్రాథమిక కీని(TG Set Primary Key) ఇప్పటికే విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలను(Objections) స్వీకరించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ గడ్డం నరేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు తమ వెబ్సైట్లో హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఉపయోగించి, లాగిన్ అయి, అభ్యంతరాలు లేవనెత్తవచ్చని చెప్పారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందన్నారు. దీనిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు : కేటీఆర్
KTR | ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? నిలదీసిన కేటీఆర్
Harish Rao | అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి.. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్