KTR | హైదరాబాద్ : మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గోమారంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మాట్లాడారు. నిన్న రాత్రి గోమారంలో ఆమె ఇంటిపై జరిగిన దాడి వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇక మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు ఫోన్ చేసి.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల ముందే దాడి చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహించారని హరీశ్‌రావు మండిపడ్డారు. దాడి దృశ్యాలు ఉన్నా విచారణ ఎందుకు జాప్యమవుతుందని హరీశ్‌రావు ఎస్పీని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మణిదీపక్ ఫిర్యాదుతో కాంగ్రెస్ కార్యకర్తలు రమేశ్, నరసింహా, భాస్కర్, సుధాకర్‌పై కేసు నమోదైనట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? నిలదీసిన కేటీఆర్
Gadwala | 306 మంది విద్యార్థులకు, ఇద్దరే ఉపాధ్యాయులు.. ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు
Harish Rao | అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి.. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్