సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జహిరాబాద్‌లోని హైవేపై(Zaheerabad Highway) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో(Cars container) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎనిమిది కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ముంబై-హైదరబాద్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.