TG TET 2024-II | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. www.schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం 7032901383, 9000756178 నంబర్లను సంప్రదించొచ్చు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20.
ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్‌కు హాజరై, అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందు వెసులుబాటును కల్పించింది. డిసెంబర్ 26 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశముండగా, 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్ష లను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణలో కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా మారిన బీజేపీ : కేటీఆర్
KTR | అమావాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమికి కూడా పేలట్లేదు.. పొంగులేటికి కేటీఆర్ చురకలు
KTR | గాడ్సే శిష్యుడు రేవంత్ గాంధీ విగ్రహం పెడుతాడంట.. మండిపడ్డ కేటీఆర్