KTR | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
మేము రేవంత్ రెడ్డిని తిడితే బండి సంజయ్, రఘనందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకు రోషం వస్తోంది. అసలు ఆ ఎంపీలు బీజేపీలో ఉన్నారా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? రేవంత్ కూడా బీజేపీలో ఉన్నాడా? కాంగ్రెస్‌లో ఉన్నాడా? అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు.
త్రిపుల్ ఆర్ సినిమా కన్నా ఆర్ఆర్ ట్యాక్స్‌లు ఎక్కువ అయ్యాయంటూ ప్రధాని మోడీయే అన్నాడు. కానీ రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు లేవు. మణికొండలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నారు. మణికొండ, మక్తల్, భువనగరిలో కలిసి కాపురం చేస్తున్నది ఎవరు..? మళ్లీ వాళ్లే సిగ్గు లేకుండా మాట్లాడతారు. బీజేపీ, బీఆర్ఎస్లు పదవులు పంచుకున్నట్లు ఒక్క సంఘటనైనా చూపించగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అమావాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమికి కూడా పేలట్లేదు.. పొంగులేటికి కేటీఆర్ చురకలు
KTR | గాడ్సే శిష్యుడు రేవంత్ గాంధీ విగ్రహం పెడుతాడంట.. మండిపడ్డ కేటీఆర్
KTR | మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం