KTR | హైదరాబాద్ : గాడ్సే శిష్యుడు రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెడుతాడంట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
మనం గట్టిగా మూసీ గురించి అడిగితే కొత్త పల్లవి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డి. బాపు ఘాట్ వద్ద అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు. గాంధీ గారికి విగ్రహాలు ఇష్టం ఉండదని అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మా గాంధీ గారి మనువడు చెప్పారు. గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? మహత్మా గాంధీని విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలకు పైసలు లేవంట. కానీ మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట. రూ. 1100 కోట్లతో అయిపోయే మూసీ పునరుజ్జీవం విషయంలో మూసీలో రూ. లక్షా 50 వేల కోట్లు పోసే కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎంత ప్రయోజనం అంటూ ప్రశ్నించారు కదా? మరి మూసీతో మురిసే రైతులెందరూ, మూసీతో కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత? మూసీ మూటల్లో మీ వాటా ఎంత? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
బీజేపీ కూడా మొత్తానికి ఈ విషయంలో స్పందించింది. సంతోషం. రూ. లక్షా 50 వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తని ఖర్చు చేస్తారో అడగండి. అడగటంతో ఆపకుండా విచారణ కూడా చేపట్టాలని నేను కోరుతున్నా. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోడీయే అంటారు. మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారు. మేము అమృత్ టెండర్ల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేదు. మూసీ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు లూటీ చేస్తుంటే బీజేపీ వాళ్లు ప్రశ్నించటం లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
KTR | దేవుళ్లనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే.. కేటీఆర్ సెటైర్లు
KTR | హైదరాబాదీల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా : కేటీఆర్
KTR | కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు : కేటీఆర్