RTC buses | కరీంనగర్ (Karimnagar)లో ఆర్టీసీ బస్సులు (RTC buses) హల్చల్ చేశాయి. జమ్మికుంట (Jammikunta) నుంచి హుజూరాబాద్ (Huzurabad) వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైవర్లు రేసింగ్ (Drivers racing) జరిపారు. పోటాపోటీగా బస్సులను నడిపి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశారు. నువ్వా.. నేనా అన్నట్లు రహదారిపై అత్యంత ప్రమాదకరంగా బస్సులను నడుపుతూ డ్రైవర్లు బీభత్సం సృష్టించారు.
బస్సుల రేసింగ్ చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా బస్సులు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులతో రేసింగ్ జరిపిన డ్రైవర్లు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి హుజురాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై, అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ, వేరే వాహనాలు వెళ్లనీయకుండా భయాందోళనకు గురి చేసిన హుజురాబాద్ డిపోకు చెందిన మూడు ఆర్టీసీ బస్సులు
ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే… pic.twitter.com/TkdmTcdSZH
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025
Also Read..
Girl Molest | ఇన్స్టాలో పరిచయం.. బాలికపై అత్యాచారం చేసిన యువకుడు
Beer Bottles | లిక్కర్ లారీ బోల్తా.. రూ. 25 లక్షల విలువ చేసే బీర్లు నేలపాలు..!
Siricilla | యూరియా కోసం రైతుల గోస.. సింగిల్ విండో గోదాంలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద పడిగాపులు