Beer Bottles | లిక్కర్ లారీ బోల్తా.. రూ. 25 లక్షల విలువ చేసే బీర్లు నేలపాలు..!
Beer Bottles | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది.
Beer Bottles | భీమదేవరపల్లి, ఆగస్టు 13 : సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ బాలు దాస్, క్లీనర్ నరేష్ క్షేమంగా బయటపడ్డారు. సంగారెడ్డి నుండి హనుమకొండ డిపో -1కు పెట్టెలతో కూడిన బీర్లను లారీలో తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ బాలుదాస్ నిద్రమత్తులో వాహనం నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు, ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. లారీలో ఉన్న లిక్కర్ బాటిల్స్ విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. లిక్కర్ బాటిల్స్ అపహరణకు గురికాకుండా ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్సై తిరుపతి, సిబ్బంది ఖలీల్, లాల, రవీందర్, ముల్కనూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

