Girl Molest | జోగులాంబ గద్వాల : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికకు మాయమాటలు చెప్పి.. లొంగదీసుకున్నాడు. ఆపై ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మైనర్ గర్భం దాల్చింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్‌లో వెలుగు చూసింది.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన హరికృష్ణ(21)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కుత్బుల్లాపూర్‌కు చెందిన బాలిక(16) పరిచయమైంది. 5 నెలల పరిచయంలోనే దగ్గరై, యువకుడు జూన్‌లో ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కి రమ్మని చెప్పగా అక్కడికి వెళ్లింది. అక్కడ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై మొదటిసారి అత్యాచారం చేసి ఎవరికి చెప్పొద్దని చెప్పి.. ఆ తర్వాత మరో రెండుసార్లు కోరిక తీర్చుకున్నాడు.
ఇటీవల బాలిక వాంతులు చేసుకోవడంతో.. ఆమె పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భం దాల్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులు నిలదీయడంతో.. యువకుడితో జరిగిన విషయాన్ని చెప్పేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.