DOST | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేనలు సోమవారం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
అర్హత గల విద్యార్థులు రూ.400 చెల్లించి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపడతారు. ఈ నెల 12న సీట్లను కేటాయిస్తారు. సీట్లు వచ్చిన వారు ఈ నెల 16 వరకు సెల్ప్‌రిపోర్టింగ్ చేయడంతో పాటు, నేరుగా సీటు వచ్చిన కాలేజీల్లోను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలి : హరీశ్‌రావు
Harish Rao | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ : హరీశ్‌రావు
MLA Koonamneni | పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి : కూనంనేని సాంబశివరావు