Harish Rao | హైదరాబాద్ : అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని 16వ ఆర్థిక సంఘానికి సూచించినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ బనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం నేడు ప్రజాభవన్‌లో పలు రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరపున హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద హాజరయ్యారు. తొలి రోజు 16వ ఆర్థిక సంఘం ముగిసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
16వ ఆర్థిక సంఘానికి బీఆర్ఎస్ తరపున పలు ప్రతిపాదనలు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని సూచించాం. బాగున్న రాష్ట్రానికి తక్కువ నిధులు వచ్చేలా ప్రస్తుత విధానం ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బాగా పని చేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించే విధానాలు ఉండాలి. పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగా లేవు. పట్టణీకరణ పెరుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు మాత్రమే సాధ్యమవుతాయి. ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నిధులు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ : హరీశ్‌రావు
MLA Koonamneni | పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి : కూనంనేని సాంబశివరావు
Rain Alert | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..!