నిర్మల్ : టీఆర్ఎస్తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
గతంలో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని వివరించారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ..ఒక్కో లబ్ధిదాడికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.
డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. దళిత బంధును ఎన్నికల స్టంట్ అని విమర్శలు చేసిన విపక్ష నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్