Dasara Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు. 15వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు పాఠశాలలకు రేపట్నుంచి తప్పనిసరిగా దసరా సెలవులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా కార్పొరేట్, ప్రయివేటు స్కూల్స్ నిర్వహిస్తే, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Bathukamma | తరతరాల మహిళా సామూహిక శక్తి బతుకమ్మ : కేసీఆర్
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధుల విడుదల.. తెలంగాణకు రూ. 416 కోట్లు మాత్రమే