Bathukamma | తరతరాల మహిళా సామూహిక శక్తి బతుకమ్మ : కేసీఆర్
KCR | తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma | హైదరాబాద్ : తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.
ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు పట్టణాలు అనే బేధం లేకుండా మహిళలతో పిల్లాపాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని కేసీఆర్ గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని గుర్తు చేశారు.
మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటాపాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు కేసీఆర్.
ఇవి కూడా చదవండి..
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధుల విడుదల.. తెలంగాణకు రూ. 416 కోట్లు మాత్రమే
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bathukamma
- BRS party
- KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

