హైదరాబాద్ : రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్(CV Anand) నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ నెలాఖరతో శివధర్ రెడ్డి పదవీకాలం ముగయనున్నది. ఆయన స్థానంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్రం నుంచి ఐదుగురి పేర్లు యూపీఎస్సీకి పంపగా వారిలో అర్హులైన ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ర్టానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ర్టానికి సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు వచ్చాయి. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీగా ఉన్న బీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Airlines | ప్రభుత్వం ఆదుకోవాలి.. విమాన ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రానికి ఎఫ్ఐఏ లేఖ