Skill University | కొత్త ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో పలు రంగాల కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించామని.. ఇందులో విజయదశమి నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై శనివారం సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారని.. పనులు ముగిసేంత వరకు తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇందుకు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, నాక్, నిథమ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్‌గా శ్రీనివాస సీ రాజును నియమించినట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయని.. దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మొదట స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, ఎన్ఏసీ, డాక్టర్ రెడ్డీస్, టీవీజీకే, అదానీ భాగస్వాములు ఉండేందుకు అంగీకరించారన్నారు.
వీటితో పాటు సీఐఐ సైతం ముందుకు వచ్చారని తెలిపారు. యూనివర్సిటీ కి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతంతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమీక్షలో ఆయాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేష్ రంజన్, బుర్రా వెంకటేశ్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, శ్రీని రాజు, వీవీఎల్‌ఎస్ సుబ్బారావు పాల్గొన్నారు.
KTR | చట్టాలను గౌరవించే వ్యక్తిని.. మహిళా కమిషన్ ఎదుట హాజరవుతా.. : కేటీఆర్
KTR | ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం : కేటీఆర్
TG Rains | ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ