TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, పరిసర ప్రాంతాలను ఆనుకొని దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, పరిసరాల్లో ఉందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని వాతావరణశాఖ పేర్కొంది. కొంకణ్ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి.. ప్రస్తుత ఉత్తర కర్ణాటక, ఇంటీరియర్ కర్ణాకట నుంచి కొమోరియన్ ప్రాంతం వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుపడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రిసిఇల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగ గద్వాల జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Jagadish Reddy | రైతులంతా ఏకమవ్వాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలి.. జగదీశ్‌రెడ్డి పిలుపు
Harish Rao | తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు