KTR | రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వంకుట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్రెడ్డిలాంటి సీనియర్ అధికారిపై దాడి చేసినంత పని చేశారన్నారు. ఓ వైపు సీఎం అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులపై దాడి చేస్తుంది.. మరోవైపు సీఎం, ప్రభుత్వమేమో ప్రభుత్వ ఆస్తులపైనే దాడి చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో రుణమాఫీకి 47లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది.. రుణ మాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. రూ.31వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించిందని.. రూ.26వేల కోట్లంటూ బడ్జెట్ ఆమోదించిందని.. చివరకు రూ.17వేల కోట్లతో రుణమాఫీ అన్నారన్నారు. కేవలం 22లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరిస్తామని.. వివరాలను కలెక్టర్లకు అందజేస్తామని.. ఆ తర్వాత ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
రెండురోజుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలుపెడుతామని.. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రతి మంత్రి నియోజక వర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. మా కాల్ సెంటర్‌కి దాదాపు 1.20లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఒక ప్రొఫార్మా తయారు చేసి.. దాని ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కానీ బాధ్యతలు తీసుకుంటారన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయన్నారు. కనీసం 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. రైతులు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తందని విమర్శించారు. సీఎం వందశాతం రుణమాఫీ పూర్తి అయిందని చెబుతుంటే.. ప్రభుత్వం రుణమాఫీ కానీ వాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టడం డొల్ల వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయించడం దేనికి నిదర్శనమని నిలదీశారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం కారణంగా ఫాక్స్ కాన్ ఏమైనా వెనక్కి వెళ్లిపోయిందా..? 40వేలతో చైనా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్‌ని బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం నిలదీశారు. ఫాక్స్ కాన్ పెట్టుబడులపైన, విస్తరణపై ప్రభుత్వం నిజనిజాలను బయటపెట్టాలని.. తదుపరి విస్తరణను ఫాక్స్ కాన్ సంస్థ చేస్తుందా ? లేదా ? సీఎం చెప్పాలన్నారు. సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు, చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకి పోయిందా ? అనిపిస్తుందన్నారు.
KTR | రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Jagadish Reddy | రైతులంతా ఏకమవ్వాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలి.. జగదీశ్‌రెడ్డి పిలుపు
Harish Rao | తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు