KTR | తెలంగాణ మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరవుతానని తెలిపారు. గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరిగిన దురాగతాల వివరాలను కమిషన్‌కు అందజేస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు. మా మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, నేతలు వ్యాఖ్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని చెప్పారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
KTR | రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR | ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం : కేటీఆర్