Tammineni Veerabhadram | వరంగల్ : సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల గణన కోసమే సర్వే చేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని, మైనార్టీ నాయకులను అణిచివేస్తున్నదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హమీలు ఎప్పుడో అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీకే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా, రూ. రెండు లక్షల రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్లో ఏ మంత్రి ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తమ్మినేని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Cotton | పత్తి కొనుగోలుకు సీసీఐ కండిషన్స్.. టార్గెట్ అయిపోయిందంటూ గేటుకు తాళం
RS Praveen Kumar | కొలిమిలా కొడంగల్..! సీఎం రేవంత్ తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
Basara | బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించిన బీఆర్ఎస్వీ నాయకులు.. అరెస్ట్ చేసిన పోలీసులు