RS Praveen Kumar | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు. ఈ మేరకు ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా స్పందించారు.
అయ్యా రేవంత్ రెడ్డి గారూ.. కొంచెం ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర పర్యటనలు ఆపి కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగలే కొలిమిలా మారింది. తమరి అసమర్థత, ప్రతీకారధోరణి, అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం 19000 ఎకరాలు సేకరించి ఉన్నా, మళ్లీ వేల ఎకరాలు అదనంగా ఫార్మాకు ఎందుకు సేకరించాలన్న సంగతి మీరు తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పకుండా.. అమాయక అధికారులను ‘మానవ కవచంగా’ వాడుకుంటున్నారని ఆర్ఎస్పీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పేద రైతులతో మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎందుకు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు.
కొండారెడ్డిపల్లిలో వేల ఎకరాల మీ భూములను మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఇచ్చిండ్రా? ఇవ్వగలరా?
వేల ఎకరాలున్న మీకే దాన గుణం లేనప్పుడు, రెక్కాడితే డొక్కాడని భూమినే నమ్ముకున్న పేద బంజారాలు భూమిని ఎట్ల ఇస్తారని అనుకున్నరు? వాళ్లకేమైనా మీ ఫార్మా కంపెనీలో భాగస్వామ్యం ఇస్తరా? అంటే ఇవ్వరు అని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు.
అదేవిధంగా గ్రూప్ -4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఆప్షన్ మీరు తలుచుకుంటే రెండు నిమిషాల్లో వస్తుంది. తద్వారా వేలాది బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఆపొచ్చు. మీకు ఆ రెండు నిముషాల టైం కూడా దొరుకుతలేదా..? అని ప్రశ్నించారు.
ఇక రైతుల సంగతి సరేసరి. ఇట్ల ఎన్నో సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇట్ల మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒక అనాథగా – అగ్నిగుండంగా మారింది. జీవనం ఎడతెరిపిలేని యుద్ధంలా తయారైందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
అయ్యా @revanth_anumula గారు,
కొంచెం ఢిల్లీ, కేరళ , మహారాష్ట్ర పర్యటనలు ఆపి కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగలే కొలిమిలా మారింది. తమరి అసమర్థత, ప్రతీకారధోరణి, అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది.గత…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 12, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షల ఆర్థికసాయం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్