KTR | హైదరాబాద్ : అమ్మా అధైర్య పడకండి.. నేను మీకు అండగా ఉంటా అంటూ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని ఆందోళన చేసిన మానకొండూర్ నియోజకవర్గం గంగిపల్లికి చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సర్వీస్ నుంచి తొలగించగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు, ఈ నెల 14న తన చెల్లెలి పెళ్లి ఉండడంతో తన తల్లి తీవ్ర బాధలో ఉందని శ్రీనివాస్ రెండు రోజుల క్రితం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ను కలిసి తెలిపాడు. వెంటనే శ్రీనివాస్ తల్లితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, బిడ్డ పెళ్ళికి ఆర్థిక సహాయం చేస్తానని, శ్రీనివాస్‌ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకునేలా కొట్లాడుతానని భరోసానిచ్చారు.
శ్రీనివాస్ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారి కూతురి వివాహం కోసం రూ. 3 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఈ రోజు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Jagadish Reddy | ధాన్యం కొనుగోళ్లలో వందల కోట్ల అవినీతి జరిగింది : జగదీష్ రెడ్డి