KTR | ఒకసారి తెలంగాణ వచ్చి చూడండి.. ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్నారని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు
KTR | అణిచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
KTR | అణిచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఖర్గే ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు. అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా చెప్పారు.
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. వాళ్లలో కొందర్ని కొనుగోలు చేశారని.. మరికొందరిని బెదిరించారని తెలిపారు. కానీ అలా పార్టీ మారిన ఎవరూ కూడా తమ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందని విమర్శించారు. వారిని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నిలబెట్టి దీనిపై అడగాలని ఖర్గేను డిమాండ్ చేశారు. వాళ్లందరూ కూడా కోర్టులకు, తమ పదవి పోతుందేమోనని గజగజ వణికిపోతున్నారని తెలిపారు.
సోమవారం నాడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. విపక్షాలను అణిచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యే గొర్రెలను కొన్నట్లుగా కొంటున్నారని ఆరోపించారు. నలుగురు వ్యక్తులు ( మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ) నలుగురు కలిసి దేశాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. మోదీ అబద్దాల కోరు అని.. తన వాగ్దానాలను ఎప్పడూ నెరవేర్చలేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- goats
- KTR
- Mallikarjun Kharge
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

