Jagadish Reddy | ధాన్యం కొనుగోళ్లలో వందల కోట్ల అవినీతి జరిగింది : జగదీష్ రెడ్డి
Jagadish Reddy | పత్తి, వరి ధాన్యం కొనుగోలు(Grain purchases) విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి(Jagadish Reddy) రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : పత్తి, వరి ధాన్యం కొనుగోలు(Grain purchases) విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి(Jagadish Reddy) రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కొనుగోళ్లు జరపకుండా పథకం ప్రకారం రైతులను దళారీలకు, మిల్లర్లకు వదిలేశారని విమర్శించారు. దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు.
పదేళ్ల కాలంలో కేసీఆర్ పండిన ప్రతి గింజను కొన్నారు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారు. జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కై వందల కోట్లు వసూలు చేశారన్నారు. 2014 కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎందుకు దోపిడీకి గురి అవుతున్నారో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలన్నారు.
మేధావులు కొడంగల్‌కు వెళ్లాలి..
ఇప్పటి వరకు ఒక్క గింజ సన్న వడ్లు ప్రభుత్వం కొనలేదని, సమాధానం చెప్పడానికి అధికారులు భయపడుతున్నారని తెలిపారు. ప్రజలు మర్చిపోయారు అంటున్న కేసీఆర్‌ను చూసి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు
మొదలయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజమైన కాంగ్రెస్
కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారని చెప్పారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలని హితవు పలికారు.
కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీకి 25 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్లు మొక్కారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ ఢీల్లికి వెళ్లింది కాంగ్రెస్, బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికి అని పేర్కొన్నారు. ఎవిడెన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దానికి మాజీ ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ రైడ్స్ ను ఎందుకు బయటపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

