మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 01:20:51

గులాబీకే నిర్మాణ కార్మికుల సై

గులాబీకే నిర్మాణ కార్మికుల  సై

  • మద్దతుగా సంఘంలోని 24 విభాగాలు లేఖలు
  • కార్మికుల సమస్యపై గళమెత్తిన తొలి సీఎం కేసీఆర్‌
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అనేకరాష్ర్టాల నుంచి లక్షల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని చెప్పారు. మనం బతకాలి.. పక్కనున్నవాళ్లకు బతుకునివ్వాలన్న తెలంగాణ జీవన వైవిధ్యాన్ని, పరస్పర సహకారాన్ని, ఉపాధిని అందిస్తున్న నగరం హైదరాబాద్‌. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కార్మికవర్గ సమస్యలపై గళమెత్తిన తొలి సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే పార్టీ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌కేవీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతిస్తామంటూ భవన నిర్మా ణ కార్మికసంఘంలోని 24 విభాగాలు లేఖలు అందజేశాయి. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలబడే టీఆర్‌ఎస్‌ గురువారం జరిగే సార్వత్రిక సమ్మె కు మద్దతు ప్రకటించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్మాణరంగ కార్మికులను ఆదుకున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా తీర్మానం చేయడంతోపాటు, ప్రచారం నిర్వహిస్తామని ముందుకురావటంపై హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తీసుకున్న గొప్ప నిర్ణయాలతో దేశ, విదేశీ కంపెనీలు తరలివస్తున్నాయని, 20-30 ఏండ్లకు సరిపడా ఉపాధి మార్గాన్ని ముందుచూపుతో వేసిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కార్యక్రమంలో రైల్వేకార్మిక యూనియన్‌ నాయకుడు యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబా బు యాదవ్‌, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రూప్‌సింగ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, జీహెచ్‌ఎంసీ బాధ్యులు చెన్నయ్య, మల్లేశ్‌, కృష్ణ, లక్ష్మీనర్సయ్య, వెంకటరమణ, రమేశ్‌ పాల్గొన్నారు.