కర్ణాటక కేంద్రంగా తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్
కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..
- ఆరుగురి అరెస్టు..
- రూ.10.36 లక్షల డీజిల్ స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. కర్ణాటకలో డీజిల్ ధర రూ.86.39 కాగా, తెలంగాణలో డీజిల్ ధర రూ.95.65 ఉంది. ఈ రెండు రాష్ర్టాల మధ్య డీజిల్ ధర 9 రూపాయల తేడా ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న రాధాకృష్ణ కర్ణాటకలో డీజిల్‌ను కొనుగోలు చేసి, తెలంగాణ రాష్ట్రంలోని పలువురికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతున్నది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ బృందం గచ్చిబౌలి పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డీజిల్ నిల్వ కేంద్రంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.10.36 లక్షల విలువజేసే 10,800 లీటర్ల డీజిల్‌ను పట్టుకున్నారు. అంతేకాకుండా, అక్రమంగా డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లు మహ్మద్ షానవాజ్, మహ్మద్ నిజాముద్దీన్, మహ్మద్ సయ్యద్ ఖాన్, అమ్మడపల్లి కార్తిక్, శోభన్, చింతపల్లి కామేశ్వర్రావులను అరెస్టు చేశారు.
ప్రధాన డీజిల్ స్మగ్లర్ రాధాకృష్ణ, డోర్‌స్టెప్ డీజిల్ సర్వీసెస్ కంపెనీ యజమాని, డీజిల్ స్మగ్లర్ సూర్య అలియాస్ సాయిరాం సూర్య, డోర్‌స్టెప్ డీజిల్ సర్వీసెస్ కంపెనీ సూపర్వైజర్ రిషి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీజిల్‌తో పాటు రూ.35 లక్షల విలువజేసే ఏడు చిన్న ట్యాంకర్లను కూడా సీజ్ చేశారు. డీజిల్ స్మగ్లర్ రాధాకృష్ణపై గతంలో కూడా గచ్చిబౌలి తదితర ఠాణాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

