ఇంటర్లో ప్రతిభ చూపిన‘ప్రభుత్వ’ విద్యార్థులు
పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణులవగా ప్రథమ సంవత్సరం పరీక్షలకు 146 మంది హాజరవగా 50 మంది (34.24 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
పరిగి, ఏప్రిల్ 24: పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణులవగా ప్రథమ సంవత్సరం పరీక్షలకు 146 మంది హాజరవగా 50 మంది (34.24 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇందులో బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఎన్.శివకుమార్(922 మార్కులు), ఎంపీసీలో ఎ.స్వాతి(903) , సీఈసీలో పి.అక్షయ (871 ), హెచ్ ఈసీలో ఎం.శాంతి (816 ) సాధించి టాపర్లుగా నిలిచారు. జాఫర్పల్లిలోని మోడల్ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థిని అక్షయ సీఈసీ ద్వితీయ సంవత్స రం లో (954 ), ఎంపీసీలో అర్చిత(939 ) సాధించి టాపర్లుగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన విద్యా ర్థులను ప్రిన్సిపాళ్లు విజయకుమార్, యాదయ్య, అధ్యాపక బృందం అభినందించారు.
వికారాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సంగం లక్ష్మీబాయి గురుకుల కళాశాలలో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ్ల మొదటి సంవత్సరంలో 85 మంది విద్యార్థులకు 82 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవ త్సరంలో మొత్తం 79 మంది విద్యార్థులకు గాను 78 మంది ఉత్తీర్ణత సాధించారు.
అలాగే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 6,455 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,428 మంది విద్యార్థులు పాస య్యా రు. 53.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్స రంలో 6,456 మంది పరీక్షలు రాయగా, 3,965 మంది ఉత్తీ ర్ణత సాధించారు. 61.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో మొదటి సంవత్సరం1,353 మందికి గాను 715 మంది ఉత్తీర్ణత సాధించారు. 52.85 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 1,242 మందికి గాను 839 మంది పాసయ్యారు. 67.55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ నోడల్ అధికారి తెలిపారు.
బొంరాస్పేట: బుధవారం ప్రకటించిన ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల్లో మండలానికి చెందిన గురుకుల విద్యా ర్థినులు సత్తా చాటారు. బొంరాస్పేటకు చెందిన కనికె నందిని చేవెళ్ల గురుకుల కళాశాలలో, తుంకిమెట్లకు చెందిన సానియా తాండూరులోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నందిని ఎంపీసీలో 1000 మార్కులకుగాను 970 మార్కులు, సానియా 944 మార్కులు సాధిం చి ప్రతిభ కనబర్చారు. పేద విద్యార్థులు 4వతరగతి నుంచి గురుకుల పాఠశాలల్లో చదివి ఇంటర్లో ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందించారు.
కొడంగల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 199 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 132 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 179 మంది పరీక్ష రాయగా అందులో 84 మంది ఉత్తీర్ణత సాధించారు. కస్తూ ర్బా కళాశాలలో 74 శాతం ప్రథమ సంవత్సరం, 87 శాతం ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో అనుషా 988, బైపీసీ ద్వితీయ పరీక్షల్లో అరుణాదేవి 935, ప్రథమ సంవత్సరం లో ఎంపీసీ సబ్జెక్టులో శ్రావణి 443, నవనీత బైపీసీ సబ్జెక్టులో 430 సాధించారు.
దోమ: దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సం వత్సర విద్యార్థులు 35.7 శాతం, ఉత్తీర్ణత సాధించగా రెం డో సంవత్సర విద్యార్థులు 66.12 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. రెండో సంవత్సర ఎంపీసీ విద్యార్థిని వైష్ణవి 964/1000, మొదటి సంవత్పర విద్యార్థి అనిల్ 410/ 470 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని ఆమె తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

