గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 18:06:26

కాంగ్రెస్ వి దిగజారుడు రాజకీయాలు : విప్ కర్నె ప్రభాకర్

కాంగ్రెస్ వి దిగజారుడు రాజకీయాలు : విప్ కర్నె ప్రభాకర్

హైదరాబాద్ :  కాంగ్రెస్ రాష్ట్రానికో విధానంతో రాజకీయాలు చేస్తున్నదని, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రెస్ మీట్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ పార్టీ కి జాతీయ విధానం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం- అధికారంలో లేని రాష్ట్రాల్లో ఒక విధానం అవలంభిస్తున్నదని మండిపడ్డారు.  దేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు.

కాంగ్రెస్ నేర్పిన రాజకీయాన్ని ఇవ్వాళ దేశంలో బీజేపీ అమలు చేస్తుందన్నారు. ఎన్టీఆర్ పాలన వచ్చే వరకు గవర్నర్ ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్.. రాజ్ భవన్ ముట్టడించడం విడ్డురంగా ఉందన్నారు.రాజస్థాన్ లో ఒక విధానం, తెలంగాణలో ఒక విధానామా? ఏ నీతి తో రాజకీయం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రపతి పాలన విధించాలని అసంబద్ధ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, రాజస్థాన్ లో తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని రాజ్  భవన్ ముట్టడించడమేంటని ప్రశ్నించారు. కరోనా ప్రభావంతో పండుగలను సైతం ప్రజలు పక్కకు పెడితే కాంగ్రెస్ కరోనా రూల్స్ బ్రేక్ చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ తన రాజకీయ స్వార్ధం కోసం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆ పార్టీ పై నిప్పులు చెరిగారు.logo