TG Police | పెద్దపల్లి, జనవరి 29(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా తెలంగాణకు భారత ప్రభుత్వం 2400ల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 800ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించగా మరో 800ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టును నిర్మించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతిగనర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు.
ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపుగా 800ల మంది వరకు పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసు పహరా నడుమ ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయగా కార్యక్రమం ప్రారంభానికి ముందే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేషన్‌కు తరళించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వందల మంది నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, హౌజ్ అరెస్టులు చేశారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌తో పాటుగా ఆయన అనుచరులు పోలీసులపై తిరగబడ్డారు.
ప్రజాభిప్రాయ సేకరణ వీఐపీ గేట్ వద్దకు ఎమ్మెల్యే తన వాహణ కాన్వాయ్‌తో ప్రవేశించేందుకు ప్రయత్నించగా అక్కడ ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింలు వారిని అడ్డుకున్నారు. ఒక్కరే వెళ్లాలని చెప్పడంతో ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులు ఏసీపీపై తిరగబడ్డారు. నా వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీపై ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మండిపడ్డారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. చోద్యం చూస్తూ ఏసిపికే గొడవ వద్దంటూ తోటి పోలీసులు, ఏసీపీ మడత రమేష్‌లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లోద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీకి పరాభావం ఎదురయ్యింది. తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులును ఎమ్మెల్యే తిట్టడంతో ఏసీపీ సైతం అదే స్థాయిలో ప్రతిఘటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
షాకింగ్ వీడియో
RRR – Revanth Reddy Rajyangam
రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువు
నా వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్
ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే… pic.twitter.com/tEF8PVJilE
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
ఇవి కూడా చదవండి..
MLC Elections | పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Harish Rao | దేశానికి గర్వకారణమైన రోజు.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై హరీశ్‌రావు
Mahabubabad | విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు : వీడియో