MLC Elections | హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి(కాంగ్రెస్) కొనసాగుతున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సి రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13
పోలింగ్ – ఫిబ్రవరి 27(ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు)
ఓట్ల లెక్కింపు – మార్చి 3
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | భవిష్యత్‌లో త్రిష మరింత రాణించాలి.. ఎమ్మెల్సీ కవిత ఆకాంక్ష
Harish Rao | దేశానికి గర్వకారణమైన రోజు.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై హరీశ్‌రావు