MLC Kavitha | హైదరాబాద్ : మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో త్రిష సత్తా చాటడం మనందరికీ గర్వకారణం. భవిష్యత్తులో త్రిష మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.
గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) 53 బంతుల్లోనే శతకం బాది ఈ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్‌గా తన పేరును రికార్డుల పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమిలిని (42 బంతుల్లో 51, 9 ఫోర్లు) మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Gongadi Trisha | త్రిష రికార్డు.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ