Siddhivinayak Temple | ముంబై (Mumbai)లోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయ (Siddhivinayak Temple) నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు (devotees) డ్రెస్ కోడ్ (dress code) తప్పనిసరి చేశారు. స్కర్ట్స్, శరీరం అంతా కనిపించేలా ఉండే దుస్తులు ధరించడంపై నిషేధం విధించారు. ఆలయానికి వచ్చే భక్తులు శరీరాన్ని కప్పిఉంచే సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది.
పొట్టి పొట్టి దుస్తులు, ప్యాంటు షర్ట్స్, చిరిగిన ప్యాంట్లు వంటి దుస్తులు ధరించి ఆలయానికి వచ్చే వారిని అనుమతించబోమని తెలిపింది. పూజల సమయంలో కొందరు అగౌరవంగా భావించే అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావడంపట్ల పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని ఆలయ అధికారులు తెలిపారు. వారి ఫిర్యాదుల మేరకు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా ఆలయ నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read..
Maha Kumbh Mela | మౌనీ అమావాస్య.. భక్తులతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్.. VIDEOS
PM Modi: ప్రయాగ్రాజ్ ఘటన చాలా బాధాకరమైంది: ప్రధాని మోదీ
Maha Kumbh: అమృత స్నానానికి సాధువులు, అకాడాలు.. త్రివేణి సంగమం వద్ద భారీ బందోబస్తు