న్యూఢిల్లీ: కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆ ఘటన తీవ్ర బాధను మిగిల్చిందన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తోందన్నారు. యూపీ ప్రభుత్వంతో తాను నిత్యం టచ్లో ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్రివేణి సంగమం వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో సుమారు 14 మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025