Maha Kumbh Mela | ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Maha Kumbh Mela) ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో ఘనంగా కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. 144 ఏండ్ల తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
#WATCH | Prayagraj | Massive crowd of devotees continue to gather in Mahakumbh area to take holy dip in Triveni waters on Mauni Amavasya
1.75 crore people have taken holy dip today till 6 am; a total of 19.94 crore people have taken holy dip till 28th January, as per UP govt. pic.twitter.com/AsNs81fUa9
— ANI (@ANI) January 29, 2025
ఇక కుంభమేళాలో ఇవాళ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇవాళ మౌనీ అమావాస్య. మహా కుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో ఇవాళ భక్తులు రోజూ కంటే అధిక సంఖ్యలో త్రివేణీ సంగమానికి పోటెత్తారు. ఉదయం నుంచే సంగమంలో నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు ఏకంగా 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇక మహాకుంభ మేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకూ మొత్తం 19.94 కోట్ల మంది ప్రజలు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించింది.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya.
Source: Mela Administration pic.twitter.com/FoQrbprWGK
— ANI (@ANI) January 29, 2025
మౌనీ అమావాస్య సందర్భంగా ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాల కోసం తరలివస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇందులో భాగంగా ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించింది. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లను కాకుండా, టూ వీలర్లను వాడాలని సూచించింది. మరోవైపు కుంభమేళా ప్రాంతాన్ని ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya. pic.twitter.com/l5cmAn5DdG
— ANI (@ANI) January 29, 2025
అమృత స్నాన దినాల్లో.. మౌనీ అమావాస్య స్నానమే ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర నదీ జలం అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మౌనీ అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా పేర్కొంటారు. సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌనీ అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు. మౌనీ అమావాస్యను పురస్కరించుకొని జనవరి 28, 29, 30 తేదీల్లో ప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.
Also Read..
“Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 40 మందికి పైగా గాయాలు”
“144 ఏండ్ల తర్వాత ఘనంగా మహా కుంభ్.. త్రివేణి సంగమంలో 1.6 కోట్ల మంది పుణ్య స్నానాలు”
“Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం..!”