Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
కాగా, మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 2 వద్ద తొక్కిసలాట జరిగింది. సంగమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 40 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు మరణించినట్లుగా జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీటిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఇదిలా ఉండగా.. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya pic.twitter.com/QQt4BSIKFr
— ANI (@ANI) January 28, 2025