Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 40 మందికి పైగా గాయాలు
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అక్కడే ఉన్న బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అక్కడే ఉన్న బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. సంగమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 15 మంది మృతిచెందినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం మరణాలను ధ్రువీకరించలేదు.
ఈ తొక్కిసలాటలో 40 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తొక్కిసలాటలో జరిగిన వెంటనే సిబ్బంది తక్షణమే స్పందించారు. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో సెక్టార్2 ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభామేళాకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇవాళ దాదాపు కోటి మందికి పైగా అమృత స్నానాలు ఆచరించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద 12 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

