Harish Rao | దేశానికి గర్వకారణమైన రోజు.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై హరీశ్‌రావు
Harish Rao | ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు.
Harish Rao | హైదరాబాద్ : ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్వీఎస్-02 ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అని.. దీంతో మన సైంటిస్టుల ప్రతిభ అని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణమైన రోజు ఇవాళ అని హరీశ్‌రావు ప్రశంసించారు.
భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకు యూజర్లకు కచ్చితమైన గమన సూచనలు(నావిగేషన్, ముఖ్యంగా నౌకాయానం) అందిస్తుంది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్ జీఎస్ఎల్వీ-ఎఫ్12 మిషన్‌లో ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నేడు నింగిలోకి దూసుకెళ్లిన 2,250 కిలోల బరువైన ఎన్వీఎస్-02 శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ కేంద్రంలో రూపొందించి అభివృద్ధి పరిచారు. ఇందులో రేజింగ్ పేలోడ్‌కు అదనంగా ఎల్1, ఎల్5 నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్‌లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్‌ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి
KTR | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gslv
- harish rao
- ISRO
- NVS-02
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

