హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8 నుంచి పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు. ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను కలిసి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.