మహబూబ్‌నగర్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కురుమూర్తి స్వామి(Kurumurthy Swamy )బ్రహ్మోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కురుమూర్తి స్వామి దేవాలయానికి వెళ్లేందుకు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఘాట్ రోడ్/ఎలివేటేడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. సెంట్రల్ లైటింగ్, డ్రైన్స్,పార్కింగ్ ఇతర సౌకర్యాలతో దీనిని నిర్మించనున్నారు.