Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
Bathukamma | తరతరాల మహిళా సామూహిక శక్తి బతుకమ్మ : కేసీఆర్
Dasara Holidays | రేపట్నుంచి దసరా సెలవులు.. పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధుల విడుదల.. తెలంగాణకు రూ. 416 కోట్లు మాత్రమే