KTR | నదీజలాలపై కాంగ్రెస్ దశాబ్ధాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.
‘నదీ జనాలు-కాంగ్రెస్ ద్రోహాలు’అంశంపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. . మనం చరిత్రలో ఎన్నో చూశాం. కానీ చెక్‌డ్యామ్‌లను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోని ఇంకెక్కడా కానీ ఉండదు. కరువు నేలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన పరిపాలకుడు.. అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయుకుడు, తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
తుబంధు కేసీఆర్ గురించి రేవంత్ అనరాని మాటలు అంటున్నాడు. కేసీఆర్‌ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి. 420 హామీలిచ్చి ఎగవేసిన పార్టీని 420 సార్లు ఉరితీయాలన్నారు కేటీఆర్. సమైక్య వాదుల బూట్లు పాలిష్ చేసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉండటం బాధగా ఉంది. రేవంత్ రెడ్డికి బేసిన్లు, బేసిక్స్ తెలవదు. పదే పదే కేసీఆర్ చావును కోరుకునే రాబందు రేవంత్ అని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్టీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ నేతలంతా కుక్క మూతి పిందలేనన్నారు కేటీఆర్ . వట్టెం, సుంకిశాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అని.. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరుగడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారు. రై
దేవాదుల ఏ బేసిన్లో ఉందో అడిగే వ్యక్తి ఇరిగేషన్‌పై మాట్లాడుతున్నాడు. వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇప్పటివరకు సమీక్ష చేయలేదు. ఎస్ఎల్బీసీలో 8 మంది శవాలను బయటకు తీయలేదని పేర్కొన్నారు కేటీఆర్.
Live: “నదీ జలాలు – కాంగెస్ ద్రోహాలు” అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
📍 తెలంగాణ భవన్ https://t.co/uwik3tL7ZV
— BRS Party (@BRSparty) January 4, 2026
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం