హైదరాబాద్ : పేదలందరు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. సోమవారం బన్సీలాల్ పేటలోని బండ మైసమ్మ నగర్, సీసీ నగర్లలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..డిసెంబర్ 5న బండ మైసమ్మ నగర్లో 310 ఇండ్లకు గృహ ప్రవేశం ఉంటుందన్నారు. అలాగే డిసెంబర్ 8 న సీసీ నగర్లో 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గృహ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
పేదలు గొప్పగా బతుతకాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Khammam | బుల్లెట్‌పై తిరుగుతూ..చెక్కులు పంచుతూ
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన