బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 21:54:01

అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్‌ గేజ్‌లు ఏర్పాటు చేయాలి: సీఎం కేసీఆర్‌

అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్‌ గేజ్‌లు ఏర్పాటు చేయాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.  గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవంభించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. 

'అన్ని   ప్రాజెక్టుల దగ్గర రివర్‌ గేజ్‌లు 15 రోజుల్లో  ఏర్పాటు చేయాలి. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్‌ టైమ్‌ డేటా ఆపరేటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలి. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలి. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదలశాఖను పునర్‌వ్యవస్థీకరించుకోవాలి. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ మాన్యువల్‌ రూపొందించాలని' సీఎం ఆదేశించారు. 


logo