కార్డ్‌లెస్ ఏటీఎం
కార్డ్‌లెస్ ఏటీఎం | ఏటీఎంలను తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్.. యూపీఐ ఆధారంగా పనిచేసే ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ ఏటీఎంలను ఆవిష్కరించింది.

మొబైల్ సాయంతోనే నగదు ఉపసంహరణ
ఎన్సీఆర్ కార్పొరేషన్ నూతన ఆవిష్కరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లను తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ ఏటీఎంలను ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), సిటీ యూనియన్ బ్యాంక్‌తో కలిసి వీటిని ప్రవేశపెట్టింది. డెబిట్ కార్డులకు బదులుగా భీమ్, పేటీఎం, గూగుల్‌పే లాంటి యూపీఐ ఆధారిత యాప్‌లను కలిగిన మొబైల్ ఫోన్లను ఉపయోగించి నగదును ఉపసంహరించుకునే వీలుండటం ఈ ఏటీఎంల ప్రత్యేకత.
ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకునేందుకు కస్టమర్లు ఏటీఎంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ మొబైల్ యాప్ నుంచి లావాదేవీకి అనుమతిస్తే సరిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ప్రతి లావాదేవీకీ మారుతుంది. కనుక దీన్ని ఎవరూ కాపీ చేసేందుకు వీలుండదు. దీంతో లావాదేవీల నిర్వహణలో భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా రూ.5 వేలకు మించి నగదు ఉపసంహరించేందుకు వీల్లేదు. కానీ మున్ముందు ఈ పరిమితిని పెంచే అవకాశమున్నది. ఈ అంశంపై కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో ఎన్సీఆర్ కార్పొరేషన్, ఎన్పీసీఐ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయి.
దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఆగ్నేయ ఆసియా విభాగ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. కార్డ్‌లెస్ విత్‌డ్రా గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సదుపాయాన్ని తొలుత సిటీ యూనియన్ బ్యాంక్‌కు చెందిన దాదాపు 1,500 ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం ఆ ఏటీఎంలలో ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేశామని, హార్డ్‌వేర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. కేవలం సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తేవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

