హైదరాబాద్, ఏప్రిల్ 2: సౌత్ ఇండియా షాపింగ్ మాల్.. హైదరాబాద్‌లో మరో షోరూంను ప్రారంభించింది. సుచిత్ర సర్కిల్లో ఏర్పాటు చేసిన షోరూంను కంపెనీ ప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. కంపెనీకి ఇది 20వ షోరూం కావడం విశేషం. ఈ షోరూంలో రూ.150 ప్రారంభ ధరతో 4 లక్షల రకాల దుస్తులు లభించనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ..దక్షిణ భారతంలో మరిన్ని నగరాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు