ప్రగతికి పట్టుగొమ్మలు

రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఊపు
పెట్టుబడులు, ఉపాధిలో భారీ వృద్ధి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్)ల వృద్ధి వేగంగా పెరుగుతున్నది. 2014 నుంచి 2020 డిసెంబర్ నాటికి పెద్దసంఖ్యలో ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ కాగా, 13,379 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. వీటిలోని కుటీర పరిశ్రమల ద్వారా రూ.2,600 కోట్ల పెట్టుబడులు, 81,121 ఉద్యోగాలు లభించాయి. 4,923 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుతో రూ.11,865 కోట్ల పెట్టుబడులు, 1,31,942 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎస్ఎంఈలలో మధ్యతరహా పరిశ్రమల వాటా తక్కువగా ఉన్నది. 362 మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకాగా, రూ.4,000 కోట్ల పెట్టుబడులు, 30,493 ఉద్యోగాలు లభించాయి. ఎంఎస్ఎంఈల ఏర్పాటులో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా 25.3 శాతం వాటాతో ప్రథమస్థానంలో ఉండగా, 8.4 శాతంతో కరీంనగర్, 6.6 శాతంతో రంగారెడ్డి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పెట్టుబడుల విషయంలోనూ 24.8 శాతం వాటాతో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ముందంజలో ఉన్నది. 18.8 శాతం వాటాతో రంగారెడ్డి రెండు, 11.6 శాతం వాటాతో సంగారెడ్డి మూడో స్థానంలో నిలిచాయి. ఎంఎస్ఎంఈలకు రాష్ట్రంలో టీ ఐడియా, టీప్రైడ్ పథకాల ద్వారా రాయితీలు కల్పిస్తున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.1.22 లక్షల కోట్లు రుణాలు అందించాలని నిర్ణయించగా, అందులో 28.85 శాతం, అంటే రూ.35,197 కోట్లు ఎంఎస్ఎంఈలు దక్కించుకున్నాయి. తెలంగాణ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, ఖాదీ అండ్ విజేల్ ఇండస్ట్రీస్ కమిషన్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఆధ్వర్యంలో 2020 ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు 836 యూనిట్లకు రూ. 8.1 కోట్ల మార్జిన్ మనీని విడుదలచేశారు.
2014-20 డిసెంబర్ వరకు ఎంఎస్ఎంఈల వివరాలు
యూనిట్లు పెట్టుబడులు ఉద్యోగాలు
(రూ. కోట్లలో)
కుటీర 8,094 2,600 81,121
చిన్నతరహా 4,923 11,865 1,31,942
మధ్యతరహా 362 4,000 30,493
మొత్తం 13,379 18,467 2,43,556
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- employment
- investments
- msme
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

