గురువారం 09 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:26:58

జయశంకర్‌ నిత్య స్మరణీయుడు

జయశంకర్‌ నిత్య స్మరణీయుడు

  • సేవలను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌  నిరంతరంగా కృషిచేశారని, ఆయనను ఈ రాష్ట్రం ఎన్నడూ మరిచిపోదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కోసం ఆయనచేసిన అవిరామ కృషిని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ భావన, భావజాల ప్రచారం కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎంతో పాటుపడ్డారని, ఆయన సేవలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.


logo