సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో(Dubbaka) కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi) చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పర్యటించారు. అనంతరం దుబ్బాకలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలను, స్టేజీ మీదికి ఆహ్వానించారు.
వీరితోపాటు కాంగ్రెస్ దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కూడా స్టేజీ మీదికి నిర్వాహకులు ఆహ్వానిం చారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాల మధ్యనే మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
దుబ్బాకలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ.
ఎలాంటి అధికారం లేకున్నా స్టేజి పైకి వెళ్లిన కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి..… pic.twitter.com/IgoxwlhkFg
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష